గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో కియారా అద్వాణీ కనిపించకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇటీవల హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. గేమ్ ఛేంజర్కు సంబంధించిన తొలి ఈవెంట్ అది. కానీ కియారా రాలేదు. సౌత్ లో జరిగే ఈవెంట్స్ కు కిరాయా రావట్లేదు, ఈ విషయమై నిర్మాతలకు తన అభ్యంతరాల్ని ముందే చెప్పేస్తోంది అనే ప్రచారం జరిగింది. పోనీ.. అలానే అనుకొందాం. కానీ.. ముంబైలో జరిగిన ఈవెంట్ లోనూ కియారా కనిపించలేదు. కియారా అడ్డా.. ముంబైనే. అక్కడ ఓ ఈవెంట్ చేస్తే, దానికీ కిరాయా రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
శుక్రవారం ముంబైలో బిగ్ బాస్ ఈవెంట్ లో పాలు పంచుకొన్నాడు చరణ్. అక్కడకు కియారా కూడా వెళ్లింది. మరుసటి రోజు జరిగిన ఈవెంట్ కు మాత్రం మిస్ అయ్యింది. ఇదంతా కియారా కావాలనే చేస్తోందా, ఇక మీదట కూడా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్లకు రాదా? అనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తున్నారు. ఇక్కడకి కూడా కియారా రాకపోతే.. ఈ అనుమానాలు మరింత బలపడతాయి.
దిల్ రాజు లాంటి బడా నిర్మాత, శంకర్ లాంటి దర్శకుడు, చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాలకు కూడా హీరోయిన్లు ప్రమోషన్లకు రానంటే… కొత్త నిర్మాతల పరిస్థితేంటి? పుష్ప కోసం రష్మిక దేశం అంతా తిరిగింది. నిర్మాతలు ఎక్కడ ఈవెంట్ చేసినా వెళ్లింది. తన పూర్తి సహాయ సహకారాలు అందించింది. కియారా ఈ మాత్రం చేయకపోవడం నిజంగా ఉపేక్షించలేనిది. చరణ్ – కియారా మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉంటారు. ఉపాసనతో కూడా కియారా చాలా క్లోజ్. చరణ్ సినిమాని తన సొంత సినిమాలా భావించాల్సిన కియారా ఇలా ప్రమోషన్లకు రాకపోవడం విడ్డూరమే.