భరత్ అనే నేనుతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది కైరా అడ్వానీ. ఆ సినిమా ఇంకా బయటకు రాకుండానే రెండో చాన్సు కూడా అందేసుకుంది. అదీ కూడా రామ్‌చరణ్ సినిమాలో. రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కథానాయికగా కైరా ఎంపికైంది. `భరత్ అనే నేను` చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి దానయ్య.. చరణ్ – బోయపాటి చిత్రానికి నిర్మాత. ఆయన.. ఈ సినిమా విడుదల కాకముందే కైరా చేతిలో అడ్వాన్సు కూడా పెట్టేశారు. భరత్ అనే నేను లో కైరా – మహేష్‌ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందట. ఈ సినిమా తరవాత టాలీవుడ్లో కైరా బిజీ కాబోతోందని ట్రేడ్ పండితులు ముందే చెప్పారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. రామ్‌చరణ్ సినిమాలో ఆఫర్ వచ్చిందంటే.. కైరా బండి హైవే ఎక్కేసినట్టే.