ఏపీలో సీఐడీ, ఇంటలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతల్ని వేధించడం.. తప్పుడు కేసుల్లో ఇరికించడానికి మాఫియాలాగా మారిన వైనం కలకలం రేపుతోంది., ఆ మాఫియా నుంచి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండేలా టీడీపీ నేత కిలారు రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
స్కిల్ కేసులో కిలారు రాజేష్ ను సాక్షిగా పేర్కొన్న సీఐడీ అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారు. స్వయంగా నిఘా చీఫ్ సీతారామారాంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు. అసలుఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని ఆయినా ఆయన వ్యక్తిగతంగా చంపేస్తామని.. వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా.. తనపై దాడికి కుట్ర చేసి..ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహింప చేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లోని అంశాలు కలకలం రేపుతున్నాయి.
తన ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని, సీఐడీ ఆఫీసు సీసీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాల్ని వాడుకుని మాఫియాగా మారారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. వారిద్దరూ… జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.