సంచలన దర్శకుడు వర్మ తీసిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ అసలైతే రేపు విడుదల అవ్వాల్సి ఉంది. కాని తన భర్త గురించి చెడుగా చూపించారంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి న్యాయ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు వర్మ కేవలం హిందీలోనే ఈ సినిమా తీస్తాడని తన దగ్గర అనుమతి తీసుకున్నాడని.. కాని కన్నడ, తెలుగులో సినిమా తీయడం వల్ల తన భర్త పేరుకు భంగ పాటు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది ముత్తులక్ష్మి.
అనుకున్నట్టుగానే వర్మ కూడా అదిరిపోయే సమాధానాలతో ఆమె నోరు మూసేలా చేశాడు. వీరప్పన్ భార్య ఇంతలా బాధపడటానికి వారిదేమన్నా మహాత్మ గాంధి కుటుంబమా అంటూ చెలరేగాడు వర్మ. పైకి ఇలా మాట్లాడుతూనే సంధి కుదుర్చుకునే ప్రయత్నాలు చేశాడట కూడా.. సినిమా నిర్మాత ఆమెతో మాట్లాడి అంతా సరిదిద్దారని తెలుస్తుంది.
వర్మ తో వాగ్వివాదం చేసి సినిమాకు ముత్తులక్ష్మి అడ్డుపడ్డది డబ్బులు గుంజడానికా అని అనుకున్నా.. సినిమా వాళ్లంటే ఎవరికి అక్కసు ఉండదు చెప్పండి. అందుకే ఆమె డబ్బులు తీసుకుని సినిమా విడుదలకు పచ్చ జెండా ఊపేసిందని తెలిసిన వార్త. అయినా అడ్డు తగలడానికి అది మామూలు వ్యక్తి తీసిన సినిమానా చెప్పండి రామ్ గోపాల్ వర్మ సినిమా. అది కాక ఈ సినిమాకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర వేశాడు. సినిమా విడుదల తేది ఈ నెల 4 నుండి 11 కు మార్చిన సంగతి తెలిసిందే కదా..!