హైదరాబాద్: అమెరికన్ టీవీ నటి, సెలబ్రిటీ, బొద్దుగుమ్మ కిమ్ కర్దషియాన్ తన పర్ఫెక్ట్ క్లీవేజ్ వెనకున్న అసలు గుట్టును బయటపెట్టింది. ఆ అందాలను నిలబెట్టి ఉంచటంకోసం తాను డక్ట్ టేప్ దగ్గర నుంచి ప్యాకింగ్ టేప్, మాస్కింగ్ టేప్ వంటి అన్నిరకాల టేపులనూ వాడతానని వెల్లడించింది. వీటన్నింటిలోకీ గ్యాఫర్స్ టేప్ అయితే బెస్ట్ అని కూడా తెలిపింది. ఈ టేప్ అమర్చుకోటానికి కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుందని, అయితే ఆ మాత్రం శ్రమకు ఫలితం బాగుంటుందని వ్యాఖ్యానించింది. వీటిని తీసేటప్పుడు మాత్రం కాస్త నొప్పి ఉంటుందని హెచ్చరించింది. టేపులను వేసుకుంటున్నప్పటి ఫోటోలను కూడా బయటపెట్టింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఈ 35 ఏళ్ళ ఈ సుందరీమణి ఈ రహస్యాన్ని బయటపెట్టటం వలన ఆమె మీదున్న క్రేజ్ ఏమాత్రమైనా తగ్గితే తగ్గుతుందేమోగానీ పెరిగే అవకాశమైతే ఉండదు. మరి ఎందుకు బయటపెట్టినట్లో?