అక్కినేని నాగార్జున ఇదివరకెప్పుడో సీతారామరాజు సినిమాలో ఓ పాట పాడారు. ఇన్నాళ్లకు మళ్లీ గొంతు సవరించుకొన్నాడు. అదీ… నిర్మలా కాన్వెంట్ కోసం. నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రమిది. ఇందులో నాగ్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఓ పాట కూడా పాడి ఈ సినిమాకి కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు. ‘కొత్త కొత్త భాష.. కొత్త ప్రేమ భాష.. ‘ అంటూ సాగే ఈ పాటని అనంత శ్రీరామ్ రాస్తే నాగ్ ఆలపించాడు. ఆ వీడియోని కూడా ఆన్లైన్లో పెట్టేశారు. రేపు సాయింత్రం ఓ కొత్త సంగతి చెబుతా అని నిన్నిటి నుంచి ట్విట్టర్లో ఊరిస్తున్నాడు నాగ్. అదే ఇదేనన్నమాట. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించిన నిర్మలా కాన్వెంట్ షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తారు. వీలైనంత ఎక్కువగా ఈ సినిమాని ప్రమోట్ చేసి.. క్రేజ్ పెంచాలని నాగ్ భావిస్తున్నాడు. అందుకే… ఈ సినిమాలో ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నాడు నాగ్. మరి ఆ పాట ఎలా ఉందో మీరే చూడండి. నాగ్.. సింగర్‌గానూ అదరగొట్టేశాడని మీరే అంటారు…!