కిరణ్ అబ్బవరం నుంచి వరుస విజయాలు రావడం లేదు కానీ వరుసగా సినిమాలు వస్తున్నాయి. రెండు నెలలకి ఓ సినిమా చొప్పున విడుదలౌతునే వుంటాయి. ఈ నెలలో రూల్స్ రంజన్ వస్తోంది. ఐతే ప్రస్తుతం షూటింగ్ లో వున్న కిరణ్ సినిమా ఒకటి ఆగిపోయిందని తెలుస్తోంది.
మార్చిలో కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమా ప్రారంభమైయింది. వివి వినాయక్, సురేష్ బాబు., ఎఎం రత్నం లాంటి ప్రముఖులు చేతులు మీదగా సినిమా గ్రాండ్ గా లాంచ్ చేశారు. మంగుళూరులో దాదాపు నలభైరోజుల పటు షూటింగ్ కూడా చేశారు, దిని కోసం దాదాపుగా మూడు కోట్లు వరకూ ఖర్చు అయ్యింది.
ఐతే ఇప్పుడా సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. అవుట్ పుట్ చూసిన నిర్మాత అసహనం వ్యక్తం ఇక సినిమా వద్దు అని పక్కన పెట్టేసినట్లు టాక్. ప్రస్తుతం కిరణ్ రూల్స్ రంజన్ ప్రమోషన్స్ లో వున్నాడు, ఇది విడుదలైన తర్వాత నిర్మాతలతో మాట్లాడి సినిమా విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఐతే నిర్మాత మాత్రం అలాంటి అవుట్ పుట్ తో సినిమా చేసి కూడా లాభం లేదని, ఇప్పటి జరిగిన ఖర్చుతో బయటపడిపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.