ఈ కొత్త యేడాది ప్రారంభంలోనే హీరో కిరణ్ అబ్బవరం ఓ శుభవార్త చెప్పేశాడు. ‘క’తో మర్చిపోలేని విజయాన్ని అందుకొన్న కిరణ్…నిజ జీవితంలోనూ ప్రమోషన్ అందుకొన్నాడు. తను త్వరలో తండ్రి కాబోతున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు చేరవేశాడు కిరణ్.
గతేడాది కథానాయిక రహస్య గోరఖ్ని పెళ్లి చేసుకొన్నాడు కిరణ్. వాళ్లది ప్రేమ వివాహం. `రాజావారు రాణీ గారు` సినిమాతో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడిపోయారు. అయితే లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారు. 2024లో పెద్దల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ‘క’ విజయంతో కిరణ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తను నటించిన ‘దిల్ రూబా’ విడుదలకు సిద్ధమైంది. ‘క 2’ కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా మరో రెండు కొత్త ప్రాజెక్టులకు అంగీకారం తెలిపాడు.