ఈమధ్యే `వినరో భాగ్యము విష్ణు కథ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. అయితే.. కిరణ్ స్పీడు మాత్రం మామూలుగా లేదు. వరుసగా సినిమాల్నిపట్టాలెక్కిస్తున్నాడు. `మీటర్` మైత్రీలో రెడీ అవుతోంది. ఇది పక్కా మాస్ యాక్షన్ సినిమా. ఇప్పుడు మరో సినిమాని మొదలెట్టేశాడు. విశ్వకరుణ్ అనే కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కూడా మాస్, యాక్షన్ జోనర్లో సాగే సినిమానే. ఈమధ్య కిరణ్కి మాస్ కథలపై మక్కువ పెరుగుతోంది. `మీటర్` పూర్తి స్థాయి యాక్షన్ సినిమా. ఇందులో పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఈ కొత్త సినిమాలో సైతం.. యాక్షన్ కి పెద్ద పీట వేశారని తెలుస్తోంది. అంతే కాదు.. కిరణ్ అబ్బవరపు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నార్ట. `మీటర్` కోసం మైత్రీ మూవీస్ భారీగా ఖర్చు పెట్టింది. దానికి మించి ఈ సినిమా బడ్జెట్ కేటాయించడం విశేషం. చూస్తుంటే కిరణ్ అబ్బవరం మెల్లమెల్లగా తన సినిమా బడ్జెట్ పెంచుకొంటూ పోతున్నట్టే కనిపిస్తోంది.