టీజర్ లో, ట్రైలర్లో ఒక్క డైలాగ్, ఒక్క మూమెంట్ బాగున్నా – సినిమా చూడాలన్న ఆశ, ఆసక్తి కలుగుతాయి. ఈ విషయంలో ‘దిల్ రూబా’ సక్సెస్ అయ్యింది. ‘క’ తరవాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా ‘దిల్ రూబా’. ఇప్పటి వరకూ 3 పాటలు వదిలారు. మూడూ బాగున్నాయి. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది.
”తప్పు జరిగిపోయిన తరవాత చెప్పే సారీకీ
అవసరం తీరిపోయిన తరవాత చెప్పే థ్యాంక్స్కీ నా దృష్టిలో వాల్యూ లేదు” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఈ డైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం చెప్పేశారు. హీరోకి సారీ, థ్యాంక్స్ ఇవి రెండూ చెప్పే అలవాటు లేదు. అదే… ఈ డైలాగ్ లో ప్రజెంట్ చేశారు.
”తప్పు చేయని ప్రతోడూ నా దృష్టిలో హీరోనేరా. వాడు చేసిన తప్పు రియలైజ్ అయినవాడు ఇంకా పెద్ద హీరో”
‘చూడ్డానికి ఐస్ క్రీమ్ లా ఉన్నావ్.. తిరి పారదొబ్బుతా’
‘మీ ఆడోళ్ల కోసం మా మగాళ్లు యుద్ధాలు చేసినా మీకర్థమై చావదే’ – ఈ డైలాగ్ లో పూరి మార్క్ కనిపించింది.
‘దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా నీకు. మనిషి మోసం చేయడం మొదలెట్టినప్పుడు’ డైలాగ్‌లో చాలా ఫిలాసఫీ ఉంది.
హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా చాలా డిఫరెంట్ గా తీర్చిదిద్దారని పిస్తోంది. ‘ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప’ డైలాగ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కి అద్దం పడుతుంది. దాదాపు ఈ ట్రైలర్‌లోని డైలాగులన్నీ కథని, పాత్రల తీరుతెన్నుల్ని ఆవిష్కరించేవే. యాక్షన్‌కి కూడా మంచి స్కోప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. విశ్వకరుణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్ సంగీతాన్ని అందించారు.