యూత్ లో తనకంటూ క్రేజ్ తెచ్చుకోగలిగాడు కిరణ్ అబ్బవరపు. `ఎస్.ఆర్.కల్యాణమండపం` సూపర్ హిట్టవ్వడం, నిర్మాతలకు భారీ లాభాలు రావడంతో చిన్న నిర్మాతల దృష్టి తనపై పడింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలో మరో సినిమా రెడీ అయ్యింది. అదే `సమ్మతమే`. చాందినీ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. టీజర్ విడుదలైంది.
పెళ్లికి ముందు ప్రేమ అనే దానిపై సదాభిప్రాయం లేని ఓ కుర్రాడి కథ ఇది. అసలు ప్రేమంటేనే తనకు తెలీదు. అలాంటి ఓ అబ్బాయి.. ప్రేమలో పడడం, దాన్ని సాధించుకోవడం.. ఇదీ సమ్మతమే స్టోరీ. టీజర్లో చెప్పిన కథ ఇదే. ఈ కథలో పాయింటేం కొత్తగా లేకపోయినా.. ఆ మూమెంట్స్ మాత్రం నచ్చేసేలా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ నే కాదు, హీరోయిన్ క్యారెక్టర్‌పై కూడా ఫోకస్ పెట్టి, బాగా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. కిరణ్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమాలోనూ అది వర్కవుట్ అయినట్టే కనిపిస్తోంది. వచ్చీ రానీ హిందీలో కిరణ్ డైలాగులు ఫన్నీగా సాగాయి. టీజర్ కూల్‌గా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జూన్ 24న విడుదల కానుంది.