కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను రాజకీయ జీవితంలో పైకి రావడానికి కిరణ్ సాయపడ్డారు. అదీ కూడా కాళ్లు పట్టుకుని అడిగితేనే సాయపడ్డారు. ఈ విషయాన్ని కిరణ్ కుమారే స్వయంగా చెప్పారు.
ఓ సారి డీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు కిరణ్ దగ్గరకు వెళ్లి రాత్రి పదకొండుగంటలకు కాళ్లు పట్టుకుని తనను డీసీసీ అధ్యక్షుడ్ని చేసేలా సహకరించాలని కోరారు. మళ్లీ తాగేసి వచ్చి పట్టుకున్నా అని అనుకుంటాడేమోని.. పొద్దున్నే వచ్చి మళ్లీ కాళ్లు పట్టుకున్నారట.. ఇది చెప్పడం కిరణ్ కు ఇష్టం లేకపోయినా… కిరణ్‌పై పెద్దిరెడ్డి చేస్తున్న ఆరోపణలతో చెప్పక తప్పలేదన్నారు కిరణ్. తన కాళ్లు పట్టుకోలేదని ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్ కూడా చేశారు.
పెద్దిరెడ్డి బతుకంతా కాళ్లు పట్టుకుని పైకొచ్చి… అలా సాయం చేసిన వారి కాళ్లు లాగేసే ప్రయత్నం చేసిన బాపతేనని చిత్తూరు జిల్లాలో చెప్పుకుంటారు. ఓ సారి దివాలా స్థితిలో ఉంటే… డీకే ఆదికేశవుల నాయుడి ద్వారా అప్పటి సీఎం చంద్రబాబును కలిసి కొన్ని పనులు తెచ్చుకుని స్థిరపడ్డారు. చంద్రబాబు ఆరోజు సాయం చేయకపోతే ఎప్పుడో దివాలా దీసి ఉండేవారని చెబుతారు. కానీ ఇప్పుడు అలా వచ్చిన డబ్బులతో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని తిరుగుతున్నారు.
పెద్దిరెడ్డి కాళ్లు పట్టుడు వ్యవహారం ఇప్పుడు వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు మరోసారి పని పడుతుందన్న సెటైర్లు వస్తున్నాయి. కానీ ఎన్ని సార్లు ఆయనను నమ్ముతారు.. ఈ సారి రోడ్డున పడేస్తారని ఇతర పార్టీల నేతలంటున్నారు.
https://x.com/Telugu360/status/1781217283563778354