మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘విజేత’. ఈరోజు పాటలు విడుదలయ్యాయి. ఆడియో కంటే ముందు ‘కో.. కొకొరొక్కో’ పాట విడుదల చేశారు. ఆ పాట మాస్‌కి బాగా నచ్చింది. కోడికి కీర్తిస్తూ పాటే గీతం అది. మాసీ టచ్‌తో సాగిన ఆ పాట ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు ఈ పాటకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ‘విజేత’ ఆడియో ఫంక్షన్లో ఎవరి నోట విన్నా.. కోడి పాట గురించే ముచ్చట్లు. అలీకి ఈ పాట భలే బాగా నచ్చిందట. కీరవాణి కూడా ఇదే మాట అన్నారు. ‘నేను కోడి తినను. కానీ ఈ పాట మాత్రం బాగుంది’ అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి అయితే.. ఈ పాటకు వీర ఫ్యాన్ అయిపోయారు. ‘నాకే కాదు.. మా ఇంట్లోవాళ్లకీ బాగా నచ్చింది. పాడిన విధానం, తీసిన పద్ధతి, ప్రేమ్ రక్షిత్ వేయించిన స్టెప్పులూ అన్నీ బాగున్నాయి’ అని కితాబు ఇచ్చేశారు. ఆఖరికి చిరంజీవికీ ఇదే పాట నచ్చిందట. కోడి పాట సూపర్బ్ అనేశాడు చిరు. మొత్తానికి కోడి పాట పాపులర్ అయిపోయింది. టీజర్లో.. మెగా అల్లుడు స్టెప్పులు కూడా బాగానే వేశాడు. థియేటర్లో ఈ పాట ఇంకెంత పేలుతుందో చూడాలి.