Kodakaa Koteswar Rao Full Song
డిసెంబరు 31 అర్థరాత్రి 12 గంటల సంగతేమో గానీ
డిసెంబరు 31 సాయింత్రం 6 గంటల కోసమైతే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూశారు. దానికి కారణం… పవన్ పాడిన పాట సరిగ్గా ఆరింటికి విడుదల చేస్తామని అజ్ఞాతవాసి టీమ్ ప్రకటించడమే. ఆ పాట వచ్చేసింది. పాటని పవన్ ఏ స్థాయిలో పాడాడు అనే దానికంటే. పాట పాడేటప్పుడు పవన్ హావభావాలు, మధ్యలో వచ్చే మేకింగ్ వీడియో. ఆ పాటలో పదాలు ఇవన్నీ ఆకట్టుకున్నాయి. కోటేశ్వరరావు అనే శాల్తీని పట్టుకొని పవన్ ఆడుకొంటూ పాడుకునే పాట ఇదన్న సంగతి అర్థమైపోతోంది. కొడకా.. కోటేశ్వరరావు ఖరుచైపోతావురోయ్, పులసైపోతవురోయ్.. అంటూ ప్రాసతో పరాచకాలు ఆడేశాడు పవన్. గొలుపు, పరసు, అరసు అంటూ రైమింగ్తో కూడిన పాట ఇది. త్రివిక్రమ్ పాట రాస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ గీతం. ‘నీ దరిద్రం చెప్పడానికి నా దగ్గరున్న డైలాగులు సరిపోవడం లేదు’ అంటూ పవన్ మాటలు కూడా ఈ పాటలో వినిపించాయి. నిజానికి ఇది పాటలా లేదు, తిట్లదండకంలా ఉంది. కానీ పవన్ పాడాడు కాబట్టి.. తిట్లు కూడా మినపట్లలా కమ్మగా వినిపించాయి. మొత్తానికి పవన్ నుంచి పాట వచ్చేసింది. కొన్నాళ్ల పాటు.. ఈ గీతం హల్ చల్ చేయడం ఖాయం.