గుండె ఆపరేషన్ చేయించుకున్న కొడాలి నాని మెడికల్ అబ్జర్వేషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల కిందట ఆయనకు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్లో గుండె ఆపరేషన్ జరిగింది. దాదాపుగా ఎనిమిది గంటల పాటు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది. అియతే నెల రోజుల పాటు ఆయన పరిశీలనలో ఉండాలి.కొద్ది రోజులు ముంబై ఆస్పత్రిలో ఉన్న ఆయన తర్వాత ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ ఆస్పత్రిలోచేరారు. ఇక్కడ వైద్యులు ఆయన గుండె స్పందిస్తున్నతీరును ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు.
నెల రోజుల కిందట గుండెల్లో నొప్పి రావడంతో ఆయన ఏఐజీలో చేరారు. అయితే గ్యాస్ ట్రబుల్ మాత్రమేనని ఆయన టీం చెప్పింది. కానీ టెస్టుల్లో మూడు గుండె కవాటాలు పూడుకుపోయినట్లుగా తేలింది. ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఆయన ఆరోగ్యం సహకరించలేదు. కిడ్నీల సమస్య కూడా ఉండటంతో గుండె ఆపరేషన్లు చేయడంలో నిపుణుడు అయిన ముంబైకి చెందిన రమాకాంత్ పాండే తో ఆపరేషన్ కోసం ముంబై ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయన ఆపరేషన్ విజయవంతమయింది.
కొడాలి నాని వ్యక్తిగత అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో హైదరాబాద్ కే పరిమితయ్యారు. గుడివాడ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. అనారోగ్యం కారణంగా మరో ఆరు నెలలు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.