కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్క సారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. ఏమయిందోనని పార్టీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే వచ్ిచ టెస్టు చేసిన వైద్యులు అతిగా ఆలోచించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.
పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన కొడాలి నాని గురువారమే గుడివాడ వచ్చారు. తన నివాసంలో పార్టీ నేతలతో సమావేసం అవుతున్నారు. ముందుగా నందివాడ మండల వైసీపీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోఫాలో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమై పార్టీ నేతలు సపర్యలు చేసి డాక్టర్లను పిలిపించారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నాని బలహీనంగా ఉండటంతో సెలైన్ పెట్టారు.
కొడాలి నాని కుటుంబసభ్యులంతా హైదరాబాద్ లో నే ఉన్నారు. అనుచరులతో కలిసి కొడాలి నాని ఒక్కరే వచ్చారు. విషయం తెలియడంతో హైదరాబాద్ నుండి కొడాలి నాని కుటుంబ సభ్యులు గుడివాడకు చేరుకున్నారు. ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని విపరీతంగా ఆలోచిస్తున్నారని అందుకే ఆయనకు అనారోగ్యం తలెత్తిందని చెబుతున్నారు. అంతకు ముందు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.