గుడివాడలో పేకాట శిబిరాల వ్యవహారం రాత్రికి రాత్రి హాట్ టాపిక్‌గా మారడం పోలీసులు మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహిత బంధువులను కూడా అరెస్ట్ చేయడంతో… ఇప్పుడు అందరి దృష్టి ఆయనపై పడింది. వెంటనే.. కొడాలి నాని హుటాహుటిన వెళ్లి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. సీఎం జగన్ ఏం చెప్పారో కానీ.. బయటకు వచ్చి…” ఆ ఏం అవుతుంది..మహా అయితే ఫైన్ కట్టి వచ్చిమళ్లీ పేకాట ఆడుకుంటారని” మీడియాతో నిర్లక్ష్యంగా చెప్పేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా చెప్పారు. చట్టాలంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తిగా.. ప్రభుత్వం పేకాట క్లబ్ లన్నీ మూయించినట్లుగా చేసిన ప్రచారం అంతా అబద్దమేనన్నట్లుగా ఆయన చాలా మాటలు మాట్లాడారు. మంత్రి పదవిలో ఉండి అసాంఘిక కార్యకలాపాల్ని అంత దారుణంగా సమర్థించుకున్న వైనం.. కొడాలి నాని స్థాయిలోనే ఉంది. చాలా రెక్లెస్ గా కొడాలి నాని సమాధానం చెప్పినప్పటికీ.. ఆయన స్పందనలో… కంగారుతో కూడిన ఆందోళనతో వచ్చిన భయం మాత్రం… అందరికీ గోచరించింది.
సొంత ప్రభుత్వంలో హత్యలు జరిగితేనే.. నిందితులపై కేసులు పెట్టడం అరుదు. అలాంటిది… తన ఇలాకాలో పోలీసులు దాడి చేసి.. సొంత బంధువుల్ని అరెస్ట్ చేశారంటే.. అది యాధృచ్చికంగా జరిగింది కాదు. ఎందుకంటే.. గుడివాడ మొత్తం తాను తెచ్చుకున్న పోలీసులు ఉన్నారు. తాను తెచ్చుకున్న అధికారులు ఉన్నారు. ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా..తనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ రైడింగ్ జరిగే వరకూ తనకు తెలియదు సరికదా… రైడింగ్ జరిగిందని తెలిసిన తర్వాత … ఆ విషయాన్ని అంతటితో వదిలేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో.. చాలా పెద్ద స్థాయిలోనే గుడివాడ పేకాట క్లబ్‌ల కట్టడి గురించి వ్యూహరచన జరిగిందని కొడాలికి అర్థమైపోయింది.
ముఖ్యమంత్రిని కలిసినా… తనకు సరైన అభయం దక్కకపోవడంతో… .ఆయన ఏమవుతుంది.. పెట్టి కేసు అవుతుంది.. తన తమ్ముడు ఉంటే ఏమవుతుంది.. పెద్ద కేసులేం రావు కదా. … అని లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇక్కడ కేసులు మాత్రమే ముఖ్యం కాదు.. ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అధికార దుర్వినియోగం చేశారని.. అందరికీ అర్థమైపోతుంది. అది అయనకు మరో రకమైన మైనస్ ఇమేజ్ తెస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో. .చిన్న శిక్షలే పడతాయి.. మళ్లీ వచ్చి మళ్లీ ఆడుకుంటారంటూ.. కవరింగ్ చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలో కొడాలికి కౌంట్ డౌన్ స్టార్టయిందని… వైసీపీలో చర్చ మాత్రం సాగుతోంది.