ఏపీలో కానీ బయట నుంచి కానీ వచ్చిన ఎవరూ చంద్రబాబును పొగడకూడదు. పొడిగితే వారిపైకి బూతులతో దండయాత్ర కోసం కొడాలి నానిని దింపుతారు. పై నుంచి ఆదేశాలు వస్తే చాలు ఎవరిని అంటున్నామో అన్నది కూడా చూడకుండా బండ బూతులు తిట్టడానికి కొడాలి నాని కూడా వెనుకాముందు చూడరు. రజనీకాంత్ ఏపీకి వచ్చారు. ఆయన వైసీపీని ఏమీ అనలేదు. చంద్రబాబును పొడిగారు. వెళ్లారు. అంతే కొడాలి నాని బూతులకు పని చెప్పారు.
రజనీకాంత్ ను అత్యంత దారుణంగారు. మూడు రోజులు షూటింగ్లో ఉంటే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటారని రజనీకాంత్ ఆరోగ్యంపైనా కామెంట్ చేశారు. వయసు గురించి.. ఆరోగ్యాల గురంచి.. మాట్లాడుతూ.. మనుషుల చావుల్ని కోరుకునే రాబందుల్లా వైసీపీ నేతలు మారిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రజనీకాంత్ ను కొడాలి నాని చెప్పలేని మాటలు చాలా అన్నారు. చీకేసిన టెంకె లాంటి మొహమని మండిపడ్డారు. వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎలా పాల్గొన్నాడని ప్రశ్నించారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రజినీకాంత్ ను రంగంలోకి దించారని కొడాలి నాని విచిత్రమైన వాదన కూడా తీసుకు వచ్చారు. అయినా కానీ.. అసలు రజనీకాంత్ కాలి గోటికి కూడా సరిపోని ఈ నేతలు చంద్రబాబును పొగిడారని చెప్పి ఆయనపైనా బూతులు అందుకోవడం అందర్నీ విస్మయపరుస్తోంది. కొడాలి నాని అయినా ఎవరు అయినా పై నుంచి ఆదేశాలు వస్తేనే.. బాగా తిట్టమని సందేశం వస్తేనే ఇలా తిడతరాని.. ఇదో మానసిక రోగం అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.