టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు వారాలు దాటిపోయిన తనపై కనీసం దృష్టి కూడా పెట్టకపోవడంతో కొడాలి నాని మళ్లీ నోరేసుకుని పడిపోయారు. ఓడిపోతే కనీసం ఇంట్లో కూడా ఉండలేడని హైదరాబాద్ పారిపోతాడని అనుకున్నారు. కానీ కొడాలి నాని దర్జాగా గుడివాడలోనే ఉంటున్నారు. రెండు వారాలు అయినా తనపై చిన్న కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేకపోవడంతో ఇవాళ నోరెత్తారు. జగన్ రెడ్డితో సమావేశం తర్వాత బయటకు వచ్చి మరోసారి పిచ్చికూతలు కూశారు. కోడెలపైనే కాదు..అందర్నీ అన్నారు.
ఎవరు ఎవర్నీ టార్గెట్ చేశారో చూసుకుందామని కూడా సవాల్ చేశారు. గత వారం మాట్లాడినప్పుడు సుప్పిని, సుద్దపూసలా మాట్లాడారు. ఇప్పుడు మాత్రం రూట్ మార్చారు. మళ్లీ తాడేపల్లి నుంచి సంకేతాలు వచ్చాయేమో కానీ..రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు భరించాల్సినవన్నీ భరించి అధికారం వచ్చిన తర్వాత ఒక్క సారిగా అందరికీ బుద్ది చెబుతారని అనుకున్నారు . కానీ చట్ట పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకనే సూచనలు కనిపించకపోవడంతో రెచ్చిపోవడం ప్రారంభించారు.
ఇవాళ కొడాలి నాని బయటకు వచ్చారు.. రేప పేర్ని నాని.. ఎల్లుండి రోజా కూడా బూతులందుకుంటారు. అధికారంలో లేనప్పుడు.. ఉన్నప్పుడు కూడా వారితో బూతులు పడాల్సి వస్తే.. కార్యకర్తలు చిన్న బుచ్చుకుంటారేమో. కనీసం ఆరేడు నెలల పాటు అయినా జగన్ రెడ్డి స్టైల్ పోలీస్ డ్యూటీని చేయించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.