వల్లభనేని వంశీని అరెస్టు చేయడంతో ఆయనను పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లారు. ఆ జైలు వద్ద మీడియాతో మాట్లాడేందుకు వెనుక కృష్ణా జిల్లా కీలక నేతలంతా రావాలని పిలిపించారు. కొడాలి నాని కూడా వచ్చాడు. ఆయన మాట్లాడలేదు కానీ.. ఓ మీడియా ప్రతినిధితో మాత్రం తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఎందుకు యాక్టివ్ గా లేరు అంటే.. తన ఉద్యోగం పీకేశారని.. ఇంకెందుకు యాక్టివ్ గా ఉంటానని చెప్పుకొచ్చారు. వంశీ అరెస్టును ఎలా చూస్తారంటే.. అరెస్టులాగే చూస్తామన్నాడు. కేసులు పెడుతున్నారు కదా అంటే.. మూడు కాకపోతే ముఫ్పై పెట్టుకోవాలన్నారు.
గుడివాడలో ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేని కొడాలి నాని చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడుడ ఎప్పుడూ లూచ్చా భాషే మాట్లేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగం లేదని.. మాట్లాడలేనని ఆయన చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు.. అధికారం లేనప్పుడు అసలు మాట్లాడాలన్న సవాళ్లు వైసీపీ నుంచి కూడా వస్తున్నాయి.
వంశీ తర్వాత హిట్ లిస్ట్ లో కొడాలి నాని ఉంటారని చెబుతున్నారు. వంశీ తనపై కేసును కెలుక్కుని అరెస్టయ్యారు కానీ.. కొడాలి నాని అలాంటి పిచ్చి పనులు చేయరని.. నోటిని కూడా అదుపులోకి పెట్టుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గుడివాడలోకూడా ఆయన ఇప్పుడల్లా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.