తనకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసని.. ఇంకే నాని తెలియదని కొద్ది రోజుల కిందట ట్వీట్ చేసిన ఆర్జీవీ .. ఇప్పుడు అదే చేత్తో కొడాలి నాని పొగిడేస్తూ ట్వీట్లు చేశారు. కొడాలి నాని ఎవరో తనకు బాగా తెలుసన్నట్లుగా ఆయన ట్వీట్లు ఉన్నాయి. ఎందుకంటే గుడివాడలో గోవా కాసినోలను కొడాలి నాని తీసుకొచ్చారు. అందరూ విమర్శిస్తున్నారు కానీ ఆర్జీవీకి మాత్రం ఇవి బాగా నచ్చాయి.అందుకే గతంలో తాను ఏమన్నాను అనేది మర్చిపోయి.. వెంటనే.. కొడాలి నానిని అభినందిస్తూ ట్వీట్లు పెట్టారు.
గుడివాడను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారని… లండన్ , పారిస్, వేగాస్ స్థాయిలో ఉంచారని అభినందించారు. అంతేనా… గుడివాడలో గోవా కల్చర్‌ను వ్యతిరేకిచే వారినందర్నీ డంబోస్గా తిట్టిపోశారు. గుడివాడ ప్రజలు గోవా స్టైల్ కాసినోలను చూస్తారు కానీ.. గోవా వాళ్లు గుడివాడ రారని తెలుసుకోవాలని హితబోధ చేశారు. క్రిడిట్ మొత్తాన్ని కొడాలి నానికి కేసినో క్రెడిట్ మొత్తం కట్టబెట్టేశారు ఆర్జీవీ. అయితే వైసీపీ నేతలు.. మంత్రులు మాత్రం గుడివాడలో కేసినోలకు కొడాలి నానికిసంబంధం లేదని.. ఆయన కరోనా వచ్చి ఆస్పత్రిలో ఉన్నారని వాదిస్తున్నారు.
మరో వైపు ఈ కేసినోల వ్యవహారంపై విచారణ జరపడానికి అంతా సర్దుకుని వెళ్లిపోయిన తర్వాత పోలీసులు ఓ విచారణాధికారిని నియమించారు. ఎవరి స్థాయిలో వారు ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఏపీని గంజాయి, జూద కేంద్రాలుగా మార్చాలని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంమలో.. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.