కొడాలి నాని వైసీపీ నేతలకు అందుబాటులోకి రావడం లేదు. గుడివాడ సన్నిహితులకూ అందుబాటులోకి రావడం లేదు. చాలా రోజులుగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు కానీ.. ఎవరో ఒకరికి టచ్ లో ఉండేవారు. ఇప్పుడు అది కూడా లేదు. వంశీ అరెస్టు వార్త తర్వాత ఆయన మరింత సేఫ్ జోన్ లోకి వెళ్లారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ లో ఉండే మొదటి పేర్లలో కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు ఉంటాయి. ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీ మాజీ నేతలు రాజకీయం కాకుండా వ్యక్తిగత శత్రుత్వం పెంచుకున్నారు. . రాజకీయాల్లో మాట్లాడకూడని మాటల్ని మాట్లాడారు. టీడీపీకి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. ఎన్నికల్లో ఇద్దరు భారీ తేడాతో ఓడిపోయి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇప్పుడు వంశీ సంగతి చూడటంతో నెక్ట్స్ కొడాలి నాని అనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వంశీ కంటే ఎక్కువగా కొడాలి నాని పై టీడీపీ క్యాడర్ కు కోపం ఉంది. ఆయనపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు. టైమింగ్స్ కోసమే చూస్తున్నారు. వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారకుల్లో వైసీపీ నేతలు కూడా వంశీ, కొడాలి నాని పేరు చెబుతారు. అందుకే వారిని అరెస్టు చేసినా కింది స్థాయి క్యాడర్ నుంచి వ్యతిరేకత రాదని చెబుతున్నారు.