ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేశారని మీడియా బయట పెడితే.. ఒక్క సారిగా ఉలిక్కి పడింది ఏపీ ప్రభుత్వం. ఆదివారం రోజంతా మీడియా ముందుకు ఎవరూ రాలేదు. కానీ సాయంత్రానికి ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో మిస్ లీడింగ్ అంటూ ఖండన ఇచ్చారు. ఇందులో అసలు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టలేదని చప్పుకొచ్చారు. ఐసీఐసీఐ లేదా హెచ్డీఎఫ్సీ దగ్గర లోన్లు తీసుకోలేదన్నారు. ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
నిజంగా అది తప్పుడు వార్త అయితే… సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టి ఉండకపోతే.. ప్రభుత్వ రియాక్షన్ అలా ఉండేది కాదని ఎవరికైనా తెలుసు. అందుకే ఆ ప్యాక్ట్ చెక్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఉదయమే కొడాలి నాని మీడియా ముందుకు వచ్చేశారు. ఆయన ఎదురుదాడికి దిగారు. తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అని.. ప్రశ్నించేశారు. తాకట్టు పెట్టమని.. పెడితే తప్పేమిటన్నట్లుగా మాట్లాడారు. కొడాలి నాని ప్రకటన తర్వాత ప్రభుత్వం.. సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టేసిందని స్పష్టత వచ్చేసింది.
అయితే రెంజు రోజుల నుంచి.. అసలు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అలాంటి పని చేయదని చాలా మంది వాదిస్తూ వస్తున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలే అంటున్నారు. అది నిజం కాదని.. జగన్ అలా చేయరని వారు కూడా అనుకున్నారు. కానీ.. కొడాలి నాని క్లారిటీ ఇచ్చిన తర్వాత వారికి కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నిజమా.. జగన్ మోహన్ రెడ్డి… సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టేశారా అని ఆశ్చర్యపోవడం వారి వంతు అవుతోంది.