కొడాలి నాని తనకు టిక్కెట్ ప్రకటిస్తారన్న నమ్మకం లేదో.. లేకపోతే గుడివాడ ప్రజలు ఓడిస్తారన్న అనుమానమో కానీ.. తనకు చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ ప్రయోగాలు ప్రారంభించారు. తన వారసులు కూడా ఎవరూ రాజకీయాల్లోకి రారని తనను ఈ ఒక్క ఎన్నికల్లో ఆదరించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంతా చేసి ఆయన తన వయసు గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆయన వయసు యాభై మూడు.. వచ్చే ఎన్నికల నాటికి యాభై ఎనిమిది వస్తాయి కాబట్టి పోటీ చేయలేనని అంటున్నారు. ఇది అంత కన్విన్సింగ్గాలేదు. జగన్ మోహన్ రెడ్డికి కూడా యాభై దాటాయి. ఆయన మరో పాతికేళ్లు అధికారంలో ఉంటానని చెబుతున్నారు.
కొడాలి నాని ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో అనేక రకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎంత నిజమన్నది తెలియదు కానీ.. ఆయన రోజు రోజుకు బలహీనం అవుతున్నారని ఆయనను దగ్గరగా చూసిన వాళ్లకు అర్థం అవుతుంది. కొడాలి నానికి కూతుళ్లే ఉన్నారు. వారికి రాజకీయాలపైఆసక్తి లేదని చెబుతున్నారు. ఆయన సోదరుడి కుమారుడు ఉన్నారు. ఆయనను రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి కొడాలి నాని రాజకీయ భవిష్యత్ ఇప్పటికే రిస్క్ లో ఉంది. ఆయన ఓడిపోయి… టీడీపీ అధికారంలోకి వస్తే.. ఏపీలోకి అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదు. అనుచరుల్ని కూడా కాపాడుకోలేరు. అదే తాను గెలిచి .. టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇబ్బందే. కొడాలి నాని నోటి దురద కారణంగా టీడీపీ హిట్ లిస్ట్ లో ముందు ఉంటారు. ఆయనపై ప్రతీకారానికి ఎదురు చూస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే.. ఆయన గెలిచినా.. ఆయన రాజకీయ భవిష్యత్ కు గండమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే కొడాలి నాని చివరి ఎన్నికలన్న సెంటిమెంట్ పండిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.