ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి యుగపురుషుడి పేరు తీసేయడంపై మెల్లగా వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ముసుగు తీసేస్తున్నారు. సమర్థిస్తూ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతున్నారు. పెద్ద స్క్రిప్ట్ తీసుకు వచ్చి లక్ష్మి పార్వతి వైసీపీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె మాటలు విన్న తర్వాత.. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి అందరూ ఏకమై ఎందుకు తీసుకున్నారో చాలా మందికి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొంత మంది స్పందన బాకీ ఉంది.
వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు ముఖ్యులు. వంశీ గుండెలో స్టెంట్లు వేయించుకున్న తర్వాత బయట కనిపించడం మానేశారు. కొడాలి నాని మాత్రం .. జగన్ .. పేరు మార్పు నిర్ణయం తీసుకున్న తర్వాత బయట కనిపించడం లేదు. ఆయనకు హైకమాండ్ నుంచి స్పందించాలన్న స్క్రిప్ట్ రాలేదో… లేకపోతే.. వేడి తగ్గే సమయంలో ఆయనను దింపాలని అనుకుంటున్నారో క్లారిటీ లేదు. మూడు, నాలుగు రోజులకు ఒకర్ని దింపడం వైసీపీ స్ట్రాటజీ. ప ఈ ఇష్యూను కంటిన్యూ చేయాలని వైసీపీ నాయకత్వం అనుకుంటోందని చెబుతున్నారు. అందుకే కొడాలి నానికి ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదని వైసీపీలో చర్చ జరుగుతోంది.
అయితే కొడాలి నాని. సీఎం జగన్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల సమీక్షకూ హాజరు కాకపోవడం వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా రీజనల్ కోఆర్డినేటర్ కూడా. అసంతృప్తితో రాలేదా… వ్యూహాత్మకంగా దూరంగా ఉంచారా అన్నది తేలాల్సి ఉంది. ఆయనను ఇప్పటి వరకూ ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. ఈ పరిణామాలు ఆయనకు భవిష్యత్లు ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా వైసీపీ నాయకత్వానికి పోయేదేమీ లేదు. కొడాలి నాని నిండా మునిగిపోయారు. ఇప్పుడు వైసీపీ ఏం చెప్పినా చేస్తూ పడి ఉండాల్సిందే. మరో దారి లేదు.
ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలోనూ కొడాలి నానిని అంతే ఉపయోగించుకునే చాన్సులు ఉన్నాయి. కొడాలి అన్నీ వదిలేశారని.. రేపో మాపో మీడియా ముందుకు వస్తారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. లక్ష్మి పార్వతిని ముందుగా రంగంలోకి దించారని.. ఆమె అంత ధైర్యం లేకపోవడం కాదని అంటున్నారు.