వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. గుడివాడలో కొడాలి నానికి సీఎం జగన్ ఇంకా టిక్కెట్ ఖరారు చేయలేదు. దీంతో కొంత కాలంగా ఆయన టిక్కెట్ మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే గుడివాడలో కొడాలి నాని కాకుండా ఇంకెవరు అనే ప్రశ్న వస్తే ఎవరూ కనిపించరు. కానీ తాజాగా మండల హనుమంతరావు అనే నేత తెరపైకి వచ్చారు. ఆయన పేరుతో గుడివాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఆయనకే టిక్కెట్ ఖారరైందని.. శుభాకాంక్షలు చెబుతూ అ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
కాసేపటి తర్వాత పోలీసులు వాటిని తొలగించారు. కానీ ప్రచారంలోకి రావడానికి.. ఆ కొద్ది సేపు సరిపోతుంది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరు ?. తాము ఏర్పాటు చేసుకున్నామని కానీ.. ఏర్పాటు చేయలేదని కానీ మండల హనుమంతరావు వర్గీయల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పోనీ టీడీపీ నేతలే కొడాలి నానిపై తప్పుడు ప్రచారానికి ఇలా చేశారా అటే.. అలా చేసి ఉంటే.. పోలీసులు దేశద్రోహం కేసి పెట్టేసి ఉండేవాళ్లు. కానీ ఫ్లెక్సీలు మాత్రం తీసుకెళ్లి సైలెంట్ గా ఉండిపోయారు. అంటే వైసీపీలో తెర వెనుక ఏదో జరుగుతోందన్న గుసగుసలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు. దీంతో గుడివాడ నుంచి కొడాలి నానిని గన్నవరంకు పంపి.. వంశీని విజయవాడ పార్లమెంట్ బరిలో నిలపాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. కేశినేని నానికి ఏదో ఓ అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా.. వైసీపీ హైకమాండ్ కు తెలిసే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రజల మూడు తెలుసుకునేందుకు ఇలా చేశారని అంటున్నారు. అయితే ఈ ఫ్లెక్సీల గురిచి విచిత్రంగా చెప్పుకుంటున్నారు కానీ.. కొడాలి నానినే గుడివాడ ఎమ్మెల్యేగా ఉండాలని ఎవరూ వీధుల్లోకి రాలేదు.