కొడాలి నాని గుండెలో మూడు వాల్వ్‌లు మూసుకుపోవడంతో ఆయనకు అత్యవసరం చికిత్స చేయాల్సి ఉంది. ఆ మూడు వాల్వ్‌లకు స్టంట్స్ వేయాలా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలా అన్నది వైద్యులు నిర్ణయించనున్నారు. అయితే హైదరాబాద్ ఆస్పత్రుల కన్నా ఆయనను ముంబైలోని ఆస్పత్రికి తరలించాలని ఆలోచిస్తున్నారు. అక్కడ ప్రసిద్ధి చెందిన ఆస్పత్రులకు ఇప్పటికే కొడాలి నాని రిపోర్టులు పంపించినట్లుగా తెలుస్తోంది.
కొడాలి నాని వారం రోజుల కిందట గుండెల్లో మంటగా అనిపించడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన టీం మాత్రం కొడాలి నానికి గుండెపోటు రాలేదని కేవలం గ్యాస్ట్రిక్ సమస్య వల్లనే ఆస్పత్రిలో చేరారని.. టెస్టుల తర్వాత డిశ్చార్జ్ అవుతారని ప్రకటించారు. అయితే ఆయన డిశ్చార్జ్ కాలేదు. గుండెల్లో మూడు వాల్వ్ లు పూడుకుపోవడం తో ఏదో ఒకటి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో ఆపరేషన్ కు సిద్ధమవుతున్నారు.
గుండె ఆపరేషన్లకు ప్రసిద్ది చెందిన ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రితో కొడాలి నానిని చేర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆపరేషన్ సక్సెస్ కావడం ముఖ్యమని భావిస్తున్నారు. కొడాలి నాని వ్యక్తిగత ఆహారపు అలవాట్ల వల్ల.. ఆపరేషన్ కు ఆయన శరీరం సహకరించే స్థితికి ముందుగా తీసుకు రావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.