కొడాలి నాని ప్రెస్ మీట్ పెడితే బూతులు తప్ప ఏమీ ఉండవు. వైసీపీ పెద్దలకు అదో ఆనందం. బ్రాందీ షాపుల దగ్గర తాగుబోతుల భాష అసువుగా మాట్లాడేస్తారనే విమర్శలు టీడీపీ చేస్తూంటుంది. అయినా వైసీపీ కూలీ మీడియా లైవ్ పెట్టేస్తుంది. చూసేవాడి ఖర్మ అనుకుంటారేమో కానీ..అయితే ఈ ఆవేశంలో కొడాలి నాని నోరు జారడం సంచలనం అవుతుంది. ఓ ప్రధాన సామాజికవర్గాన్ని ఉద్దేశించినట్లుగా ఆయన చెబుతున్న మాటల వీడియో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
సహజంగా వైసీపీలో ఓ సంప్రదాయం ఉంది. ఏ కులం వాళ్లని ఆ కులంతో తిట్టిస్తారు. విచిత్రంగా కులాల్ని కూడా తిట్టిస్తారు. గతంలో అంబటి రాంబాబు సొంత కులాన్ని దారుణంగా విమర్శించారు. పేర్ని నాని కూడా అంతే. అయితే కొడాలి నానిఈ సారి తన సొంత కులాన్ని కాకుండా ఇతర కులాన్ని నిందించారు. ఆ కులం వారందర్నీ కలిపి బూతు మాట అనేశారు. ఇప్పుడీ అంశం సంచలనంగామారింది. ఆ సామాజికవర్గానికి చెందిన కుల సంఘ నేతలు.. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటున్నారు.
అయితే కొడాలి నానికి నోరు తిరగలేదని.. ఆయన అనాలనుకున్న మాట అది కాదని.. కొంత మంది వాదిస్తున్నారు. కులాల్ని ఎందుకు తిడతారని అంటున్నారు. కానీ కొడాలి నాని నైజం గురించి తెలిసిన వాళ్లు.. కులాన్నే అని ఉంటారని గట్టిగా నమ్ముతున్నారు. మొత్తంగా ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో కానీ.. కొడాలి నాని తిట్టిన సామాజికవర్గ నేతలు మాత్రం సైలెంట్ గా ఉండే అసలు పవన్ దూకుడుతో ఇబ్బంది పడుతున్న వారికి సొంత సామాజికవర్గంలోనే నిరాదరణ ఎదరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.