స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై అసభ్యంగా మాట్లాడే బాధ్యతను ఈ సారి వైసీపీ హైకమాండ్ కొడాలి నానికి అప్పగించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితతుల్లోనూ నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించకూడదని ఆంక్షలు పెడుతూ.. మీడియాతో మాట్లాడే స్వేచ్చనిచ్చింది. అయితే… ఈ సమయంలో నిమ్మగడ్డను దూషించడం తప్ప మీడియాతో మాట్లాడటానికి ఏముంటుందని ఆయన అనుకున్నారేమో కానీ.. మీడియా ముదుకురాలేదు. ఆయన బాధ్యను ఈ సారి మరో మంత్రి కొడాలి నానికి అప్పగించారు.
ఆయన రంగంలోకి దిగితే ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉదయమే మీడియా ముందుకు వచ్చి అరగంట పాటు తిట్టి వదిలి పెట్టేసారు. ఆయన తిట్టిన తిట్లకు.. ఎస్ఈసీకి చిరాకేసి.. అప్పటిపప్పుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటల కల్లా.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంత కంటేముందుగానే అంటే మూడుగంటల కల్లా కొడాలి నాని వివరణ ఇచ్చారు. అబ్బే తాను అసలు ఎస్ఈసీని తిట్టలేదని.. రాజ్యాంగ బద్దమైన సంస్థలపై తనకు ఉన్నంత గౌవరం ఇంకెవరికి ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అక్రమాలను మాత్రమే తాను ప్రశ్నించానన్నారు.
కానీ ఎస్ఈసీని … తిట్టిన తిట్లు టీవీ చానళ్లు కూడా చూపించలేక బీప్ సౌండ్లు వేసుకోవాల్సిన పరిస్థితి. తిట్టినదంతా తిట్టేసి.. తాను తిట్టలేదని వివరణ పంపారు. ఎస్ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే పెద్దిరెడ్డితో పాటు… ఓటర్లను బెదిరించిన ఎమ్మెల్యే జోగి రమేష్ పై మీడియాతో మాట్లాడకుండా ఎస్ఈసీ ఆంక్షలు విధించింది. అయితే ఒకరిపై ఆంక్షలు విధిస్తే.. తమ దగ్గర అలాంటి భాషా పండితులు కోకొల్లలుగా ఉన్నారని నిరూపించేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఓ పద్దతి ప్రకారం.. రాజ్యాంగ వ్యవస్థపై మాటల దాడి జరుపుతూ.. కించ పరుస్తున్నా… నిమ్మగడ్డ మాత్రం… తన పని తాను చేసుకుపోతున్నారు.