ప్రజా కూటమిలోని తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ… ఈ మూడు పార్టీల సీట్ల సర్దుబాట్లు దాదాపు కొలీక్కి వచ్చేశాయి. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అయితే, ఈ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే క్రమంలో పెద్ద కసరత్తే చేశాయనే చెప్పొచ్చు. ఎందుకంటే, కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా… ఆ పార్టీ ఎన్ని ఖాళీలు చూపిస్తే, అన్ని చోట్లే పోటీ చేసే వెసులుబాటు మాత్రమే ఈ మూడు పక్షాలకూ ఉంది. ఆశావహులు ఎంతమంది ఉన్నా… తెరాసను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో సీట్ల సంఖ్యను కుదించుకుని, అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. అయితే, స్నేహపూర్వక పోటీ అంటూ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తో చిన్న పేచీ కూడా ఉందనుకోండి.
తెలంగాణ జనసమితి పార్టీ మొత్తంగా 14 మంది అభ్యర్థులను ప్రకటించి, బీఫామ్ లు ఇచ్చింది. వీటిలో ఓసీలకు 6 ( బ్రాహ్మణ 1, రెడ్డి 1), బీసీలకు 2 (మున్నూరు కాపు 1, ముదిరాజ్ 1), ఎఎస్సీలకు 3 (మాల 1, మాదిగ 2), ఎస్టీలకు 3 సీట్లను ఆ పార్టీ కేటాయించింది. ఇక… ఐదు స్థానాలకు పట్టుబడుతూ వచ్చిన సీపీఐ, చివరికి మూడింటితోనే సర్దుకుంది. ఓసీలకు 1, ఎస్సీలకు 1, ఎస్టీలకు 1… ఇలా మూడింటినీ పంపిణీ చేసింది. తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే… పొత్తులో భాగంగా 13 నియోజక వర్గాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఓసీలకు 7, బీసీలకు 3, ఎస్టీ 1, ఎస్సీ 1, మైనారిటీ 1 చొప్పున టిక్కెట్లు ఇచ్చింది.
కులాల వారీగా చూసుకుంటే… ఈ మూడు పార్టీలూ వారికున్న పరిధిలో ఓసీలకు కాస్త ఎక్కువ సీట్లు కేటాయించాయి. తమకున్న 14 సీట్లలో ఆరింటిని టీజేయస్ ఓసీలకు ఇస్తే, 13లో ఏడు స్థానాలకు టీడీపీ కేటాయించింది. ఉన్న మూడింటిలోనూ ఒక స్థానాన్ని సీపీఐ కేటాయించింది. ఇక, మహిళల విషయానికొస్తే… టీజేయస్ అభ్యర్థిగా భవానీ రెడ్డి సిద్ధిపేటలో పోటీకి దిగుతున్నారు. తెరాస కీలక నేత హరీష్ రావు మీద ఆమె పోటీ చేయడం విశేషం. వైరా నుంచి సీపీఐ అభ్యర్థిగా బానోతు విజయకు అవకాశం దక్కింది. టీడీపీ నుంచి మహిళా అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నామినేషన్ వేశారు. కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.
తెలంగాణ జన సమితి పార్టీ 14 మంది అభ్యర్థులు
అభ్యర్థి పేరు | నియోజకవర్గం |
---|---|
జనార్దన్ రెడ్డి( OC) | మెదక్ |
భవానిరెడ్డి ( OC) | సిద్దిపేట |
రాజేందర్ రెడ్డి ( OC) | మహబుబ్ నగర్ |
మల్కాజిగిరి | దిలిప్ కూమార్ ( OC)బ్రాహ్మణ |
వరంగల్ తూర్పు | ఇన్నయ్య ( OC)రెడ్డి |
మిర్యాల్ గూడ . | విద్యాధర్ రెడ్డి ( OC) |
దుబ్బాక | చిందం రాజుకూమార్ (BC_D) మున్నూరు కాపు |
అంబర్ పేట | నిజ్ఙన రమేష్ (BC) ముదిరాజ్. |
స్టేషన్ ఘన్పూర్.. | చింత స్వామి ( SC ) మాదిగ |
వర్ధన్నపేట | పగిడి పాటి దేవయ్య (SC) మాదిగ |
చెన్నూరు | నరేష్ (SC) మాల |
ఖానాపూర్ | భీమ్రావు( ST) |
ఆసిఫాబాద్ | విజయ్ ( ST) |
అశ్వరావుపేట | కటకం ప్రసాద్ ( ST) |