కోదండరాం ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరాంతో పాటు సియాసత్ ఉర్దూ పత్రిక యజమానికి అమీర్ అలీ ఖాన్ కూడా ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. వీరి పేర్లను సిఫారసు చేసిన వెంటనే గవర్నర్ తమిళిసై ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆమోదించారు. నిజానికి ఈ వ్యవహారంలో కోర్టులో ఉందని.. కోర్టులో వ్యవహారం తేలిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
బుధవారం రోజుకోర్టులో సదరు పిటిషన్ పై విచారణ జరిగింది. గవర్నర్ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో.. కాంగ్రెస్ సర్కార్ సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ ఆమోదించారు. గతంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసింది. చాలా రోజులు పెండింగ్ లో పెట్టిన గవర్నర్ .. తర్వాత వారిద్దరికీ అర్హత లేదని స్పష్టం తిరస్కరించింది. అయితే కేసీఆర్ సర్కార్ వేరే వారి పేర్లను సిఫారసు చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కు ఇద్దరు ఎమ్మెల్సీలను సిఫారసు చేసే చాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో తిరస్కరణకు గురైన ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇకఈ కేసు తేలదనుకున్నారు.
గవర్నర్ నిర్ణయంపై స్టే ఇవ్వకపోవడంతో గవర్నర్ భర్తీ చేసేశారు. నిజానికి గవర్నర్ కు ఈ విషయంలో ఉన్న అధికారాలు పరిమితమైనవి. పేరుకు గవర్నర్ కోటానే అయినప్పటికీ.. నేరుగా గవర్నర్ ఎమ్మెల్సీల్ని నియమించలేరు. కేబినెట్ సిఫారసు చేసిన వారినే నియమించారు. ఓ సారి సిఫారసు చేసిన వారిని తిరస్కరిస్తే రెండో సారి సిఫారసు చేస్తే అంగీకరించి తీరాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ ఆ పని చేయకపోవడంతో రెండు ఎమ్మెల్సీలు కోల్పోవాల్సి వచ్చినట్లయింది.