అసెంబ్లీకి హాజరవ్వాలని.. తాను వైసీపీ అధినేతను ఆహ్వానించేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదని.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెబుతున్నారు. బుధవారం నుంచి అసెంబ్లీ చివరి సమావేశాలు జరగబోతున్నాయని.. ఈ సారైనా వారు వస్తే బాగుంటుందని ఆయన అంటున్నారు. 5న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందన్నారు. అసెంబ్లీకి రావాలని వైసీపీని పదేపదే కోరినా వాళ్లు రాలేదని.. జగన్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వడం లేదని స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు రావాలని ఈ సారి కూడా ప్రతిపక్షాన్ని కోరుతున్ననన్నారు. ఒక పక్షం రాకపోవడం స్పీకర్‌కు తృప్తి నివ్వదన్నా రు. అసెంబ్లీకి రాకుండా టీఏ, డీఏలు తీసుకోవడం మంచిదికాదని.. అయితే అది వారి నైతికతకు సంబంధించిన అంశమన్నారు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరినవారిపై అనర్హత వేటు వంటి అంశాలు.. అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని గుర్తు చేశారు.
ఈ టర్మ్‌లో అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలని వ్యాఖ్యానించారు. సెలవు పెట్టకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయడం..నియమాలు, సంప్రదాయాలకు సంబంధించినదని వరుసగా మూడు సెషన్లకు రాకపోతే.. అనర్హతా వేటు వచ్చని స్పీకర్ అంటున్నారు. ఇయితే ఇంత వరకూ దేశంలో.. ఇలాంటి ఘటన జరగలేదన్నారు. తాను ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో్ పనిచేస్తానని అదే విధంగా స్పీకర్ పదవిలో కూడా పనిచేశానన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరసుగా.. నాలుగో అసెంబ్లీ సెషన్ కు హాజరు కావడం లేదు. జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు.. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్నుచి వెళ్లడం లేదు.
కానీ జీతభత్యాలన్నీ యథావిధిగా డ్రా చేసుకుటున్నారు. మధ్యలో.. ఓ నెల జీతం వరదలతో అతలాకుతలమైన కేరళకు విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించారు. ఇవి చివరి సమావేశాలు కాబట్టి.. రావాలని.. వైసీపీని స్పీకర్ ఆహ్వానిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం… తన విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా చూసుకుంటోంది. వరుసగా మూడు, నాలుగు సెషన్లకు కారణంగా చెప్పకుండా సెలవు పెడితే అనర్హతా వేటు వేయవచ్చని స్పీకర్ చెబుతున్నారు కానీ.. ఇప్పుడా నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చంటున్నారు.