సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన జనపల్లి శ్రీనివాస్ ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. నాలుగేళ్లుగా ఆయన జైల్లో ఉన్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. కేసును ఎన్ఐఏ విచారణ జరుపుతూండటంతో బెయిల్ దొరకడం కష్టంగా మారింది. దీంతో జనిపల్లి శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కోడికత్తి దాడి కేసులో నిందితునిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ ఆ నాటి నుంచి రిమాండ్ ఖైదీ గానే ఉన్నాడని సుప్రీంకోర్టు సీజేఐకి రాసిన లేఖలో శ్రీనివాస్ తల్లి జనిపల్లి సావిత్రి పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎన్ఐఏ విచారణ జరిపినప్పటికి ఇంతవరకు తన కుమారుడి పట్ల తమకు న్యాయం జరగలేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా న్యాయస్థానం స్పందించి నాకుమారుడు జనిపల్లి శ్రీనివాస్ ని విడుదల చేయాలని మొరపెట్టుకున్నారు శ్రీనివాస్ తల్లితండ్రులు. ఈ కేసులో సీఎం జగన్ తనపై హత్యాయత్నం జరిగినా అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఏ విషయమూ తేల్చలేకపోయారు. కేసు రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తూంటే పట్టుబట్టి మరీ ఎన్ఏఐకి ఇప్పించారు.
నిజానికి ఇలాంటి కేసులు ఎన్ఐఏ దర్యాప్తు చేయదు. కేంద్రంలో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి చేయించారు.కానీ ఆకేసు ఎక్కడివక్కడ ఆగిపోయింది. నిందితుడు జైల్లో ఉండిపోయారు. జగన్‌కు సానుభూతి తెప్పించేందుకు కోడి కత్తి శ్రీను చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జగన్ సీఎం అయ్యారు కానీ.. శీను మాత్రం జైల్లో మగ్గుతున్నారు. ఎప్పుడుబయటకు వస్తారో ఎవరికీ తెలియదు.