తప్పు దిద్దుకుంటానని …తిరువూరులో నేతలందర్నీ సమన్వయం చేసుకుంటానని పార్టీ నాయకత్వానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయనను పార్టీ హైకమాండ్ పిలిపించి ఇక తిరువూరుకు దూరంగా ఉండాలని చెప్పాలని నిర్ణయించుకుది. ఆయన పార్టీలోకి వచ్చే వరకూ పని చేసుకున్న దేవదత్ అనే నేతకు బాధ్యతలు ఇవ్వాలని అనకుంది. కానీ తనకు మరో అవకాశం ఇవ్వాలని కొలికపూడి కోరుతున్నారు.
కొలికపూడి శ్రీనివాసరావుకు పిలిచి టిక్కెట్ ఇస్తే.. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిపెట్టినట్లుగా తిరువూరు మొత్తం రచ్చ చేశారు. అధికారులు ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీ నేతలు . జర్నలిస్టులు.. చివరికి మహిళలు కూడా వేధింపుల ఆరోపణల చేశారు. ఒకరిద్దరు అయితే అనుకోవచ్చు.. ఆయన తీరు పెద్ద సమస్యగా మారడంతో పార్టీ హైకమాండ్ త్వరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు తనకు మరో అవకాశం ఇవ్వాలని అందర్నీ కలుపుకుని పోతానని చెబుతున్నారు. కానీ కొలికపూడి లొల్లి పెట్టుకున్న వారు ఆయన బుజ్జగింపులకు తలొగ్గుతారా అన్నది సస్పెన్సే. చిన్నచిన్న విషయాలకు బెదిరిపులతో అందర్నీ దూరం చేసుకున్న కొలికపూడి.. మళ్లీ తన రాజకీయ పట్టు నిలబెట్టుకోవాలంటే.. రాజకీయం నేర్చుకోవాల్సిందే. కనీస రాజకీయం అర్థం చేసుకున్నా.. ఆయన తిరువూరులో ఎవరితోనూ గొడవలు పడేవారు కాదన్న వాదన వినిపిస్తోంది.