జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారుల్లో నెంబర్ వన్ ర్యాంక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న కొల్లి రఘురారెడ్డిని అస్సాం పంపించింది ఈసీ. ఆయనను అక్కడ పది జిల్లాలకు వ్యయ పరిశీలకుడిగా నియమించారు. ఎన్నికలు అయ్యే వరకూ ఆయన అక్కడే ఉంటారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధం లేని విధుల్లో ఏపీలో ఆయన ఉన్నారు. కానీ ఆయన తన పవర్ ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతల్ని వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై అనేక ఫిర్యాదులు వెళ్లాయి.
ఈ క్రమంలో ఆయనను ఈశాన్య రాష్ట్రానికి ఎన్నికలు అయ్యే వరకూ పంపడం ఆశ్చర్యకరమే. ఆయన బదిలీ ఉత్తర్వులు వస్తున్నాయని తెలిసిందేమో కానీ.. సిట్ ఆఫీసులో కీలక పత్రాలను తగలబెట్టారు. సీట్ ఆఫీసులో వళ్లే వీడియోలు తీసి .. మీడియాకు పంపారు. ఈ విషయం గగ్గోలు రేగడంతో ఆయన అవి జిరాక్స్ మెషిన్లో ఇరుక్కుపోయిన పత్రాలు అని కవర్ చేసుకున్నారు. అంతే కాదు కీలక పత్రాలను తగులబెట్టేశారని ప్రచారం చేయడం ఆయనను బెదిరించడమేనట.
పోలీసులకు క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే.. ఎలా వ్యవహరిస్తారో అంత కంటే ఘోరంగా ఏపీలో రాజకీయ నేతలను .. వైసీపీ పెద్దల హిట్ లిస్టులో ఉన్న వారిని టార్గెట్ చేసేందుకు దర్యాప్తు అధికారులు బరి తెగించారన్నదానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు పత్రాల దహనం కూడా ఆ కోవలోకే వస్తుంది. త్వరలో మొత్తం గుట్టు వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.