కోమటిరె్డి రాజగోపాల్ రెడ్డి ఆత్రం ఆగడం లేదు. ఆయన ఆలోచన ఎక్కడైనా ఎప్పుడైనా.. మంత్రి పదవి..ముఖ్యమంత్రి పదవి దగ్గరే ఉంటోంది. మంత్రి పదవి వస్తందని ఆయన చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంతకీ రావడం లేదు.. వస్తుందో లేదోతెలియడం లేదు. దీంతో వేరే వాళ్లు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం ప్రారంభించేశారు.
ఓ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఉత్తం రెడిని ముఖ్యమంత్రి అని సంబోధించారు. తన నాలికపై మచ్చ ఉందని ఇవాళ కాకపోయినా రేపైనా ఆయన ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ మాటలు విని ఉత్తమ్ కూడా బలవంతగా నవ్వాల్సి వచ్చింది. ఇలాంటి మాటలు తన రాజకీయ జీవితంపై ఎలాంటి ఎఫెక్ట్ వేస్తాయో ఆయనకు బాగా తెలుసు. రాజగోపాల్ రెడ్డి నాలికపై మచ్చలకు అంత పవర్ ఉంటే.. తానే మంత్రి అవుతాననో.. ముఖ్యమంత్రి అవుతాననోచెప్పుకోవచ్చు కానీ.. ఉత్తమ్ గురించి చెప్పడం ఎందుకని కాంగ్రెస్ లోనే సెటైర్లు పడుతున్నాయి.
అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి అయినా కాస్త స్థిరత్వం ఉంటుంది కానీ.. తమ్ముడిు మాత్రం అసలు ఆగడు. 2019లో కాంగ్రెస్ ఓడిపోయి తాను గెలిచిన తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయే ప్రయత్నం చేశారు. అప్పుడే తానే సీఎం అభ్యర్థినని చెప్పుకుని బీజేపీ గేట్లు మూసేశాల చేసుకున్నాడు. తర్వాత ఆయనను బకరాను చేయడానికి మళ్లీ చేర్చుకున్నారు. చివరికి కాంగ్రెస్ లోకి రాక తప్పలేదు. పదవులు ఎక్కడ వస్తాయనుకుంటే అక్కడకు పరుగెత్తే రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ లో పదవుల రేసులో తనదైన గందరగోళం సృష్టించుకుంటున్నారు.