పదవుల కోసం లాంగ్ జంప్‌లు నిమిషాల్లో చేయగల సామర్థ్యం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనలోని అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. తన అన్నకు మంత్రి పదవి ఉన్నా తనకూ ఇవ్వాల్సిందేనని ఆయన చేస్తున్న లాబీయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అవకాశం లేదని అనుకుంటున్నారేమో కానీ కూర్చున్న కొమ్మను నరుక్కోవడం ప్రారంభించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రైతు బంధును ఎగ్గొట్టామని, రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ( ప్రారంభోత్సవంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడEరు.
రైతుబంధును మధ్యలో ఒకసారి ఎగ్గొట్టినం. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా, కొంత నగదును తగ్గించినం. అందుకే గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అదే రూ.2 లక్షల రుణ మాఫీ అయినోల్లు మాత్రం జేబులో వేసుకొని సప్పుడు చేస్తలేరని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు బలం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం కుట్ర పూరితమేనని అంటున్నారు.