కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉక్కపోతకు గురవుతున్నారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు వారిని బలిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఐదు నుంచి పది కోట్లకు కొంటున్నామని అంత కంటే ఎక్కువ ఖరీదు పెట్టడం లేదని మీడియా ప్రతినిధుకు చిట్ చాట్లో చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీని నమ్మి తాము పార్టీలో చేరితే.. తామేదో డబ్బులకు అమ్ముడుపోయామన్నట్లుగా ప్రచారం చేయడం ఏమిటని వారు అసంతృప్తికి గురవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో చేశారో కానీ.. వచ్చిన ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరి అమ్ముడుపోయామన్న పేరు తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పటికప్పుడు భిన్నంగా ఉంటాయి. అలాంటి పార్టీలో చేరాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితిని కల్పిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also read : ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్
చేరికల వల్ల తమకు ప్రాధాన్యం తగ్గుతుందనో.. లేకపోతే తమ భవిష్యత్ ప్రణాళికలకు సమస్యలు వస్తాయనో కానీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డికి పదవిపై తప్ప కాంగ్రెస్ పై ఎలాంటి మమకారం ఉండదని ఇప్పటికే తేలిపోయింది. తన సోదరుడితో పాటు తనకూ మంత్రి పదవి ఇస్తే సరి..లేకపోతే మంట పెట్టడానికి రెడీ అన్నట్లుగా ఆయన తీరు ఉంది. అలాంటి నేతల్ని నమ్ముకున్నంత కాలంగా కాంగ్రెస్కు అదే పరిస్థితి ఉంటుంది.