తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల క్రెడిట్ కోసం రేస్ నడుస్తోంది. మొత్తం సీనియర్లు ఇతర నేతలను చేర్పించేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. అయితే సీనియర్లు .. మాకు చెప్పకుండానే చేర్చుకుంటారా అని పుల్లలు పట్టుకుని అడ్డం వచ్చేశారు. జూపల్లి, పొంగులేటి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వారితో పాటు నల్లగొడంకు జిల్లాకు చెందినమాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పార్టీలో చేరాలనుకున్నారు. కానీ కోమటిరెడ్డి తన జిల్లా వారిని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకుంటారా అని పట్టుబట్టి అడ్డం పడ్డారు.
తన జిల్లాకు సంబంధించిన చేరికలపై తనతో సంప్రదించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలియడంతో ముందుగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికే వెళ్లారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామన్నారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డిలకు అన్నీ విషయాలు చెబుతున్నామన్నారు. కోమటిరెడ్డి అభ్యంతరాల కారణంగా నల్లగొండలో చేరాలనుకునే నేతల కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
చేరికలు రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ కాదని.సీనియర్లు అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నాలని చెప్పుకునేందుకు కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. తన సోదరుడు కూడా మళ్లీ ిరిగి కాంగ్రెస్ కువస్తారని అందరికీ చెబుతున్నారు. వస్తే టిక్కెట్ ఇస్తారో లేదోనన్న డౌట్ ఉంది. అందుకే ఎల్బీనగర్ టిక్కెట్ కావాలని ఆయన అడుగుతున్నారు. హైకమాండ్ వద్ద చేరికల విషయంలో తనూ కొంత క్రెడిట్ పొందడానికి సీనియర్లు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.