విశాఖపట్నం కాస్త విషాద పట్నం గా మారింది. ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి బర్నింగ్ గ్యాస్ గా పిలువబడే స్టైరీన్ గ్యాస్ లీక్ అయి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికే 8 మంది దాకా మృతి చెందారు. ప్రధాన మంత్రి మోడీ హోం శాఖ అధికారులతో ఘటనపై ఆరా తీసి, సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ హరిచందన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఘటనపై వివరాలు కనుక్కున్నారు.
అయితే సమస్య ఇంత తీవ్రంగా ఉంటే, ఇది పెద్దగా భయపడాల్సిన సమస్య కానే కాదంటూ, ప్రాణాపాయానికి అవకాశం లేదంటూ సాక్షి ఛానల్ లో కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు ప్రజలను అసహనానికి గురి చేస్తున్నాయి. సంఘటన తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో జరగడంతో, న్యూస్ చానల్స్ ఉదయాన వార్తలు, డిబేట్ లు ప్రసారం చేసే సమయానికి వందలాది మంది అస్వస్థతకు గురై ఉన్నారు. అయినప్పటికీ సాక్షిలో తన డిబేట్ లో కొమ్మినేని మాట్లాడుతూ ” ఇందాక ఒక ఆఫీసర్ తో మాట్లాడాను, ఇది మరీ ప్రమాదకరం కాదు, దీంతో పెద్దగా ప్రాణాపాయం ఏమీ ఉండదు, కేవలం స్పృహ కోల్పోతారు, తర్వాతి కాలంలో కొద్దిగా సమస్యలు రావచ్చు, అయితే తక్షణం ఆక్సిజన్ అందిస్తే ఫలితం ఉంటుంది ” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి రసాయన కలకలం జరిగిన సమయంలో కూడా చాలామంది చూసే ఛానల్ లో ప్రజలను కొమ్మినేని తప్పుదోవ పట్టించడం చూస్తూ ఉంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య లేదు అని చెప్పడమే సాక్షి ఛానల్ ఉద్దేశంగా కనిపిస్తున్నట్టు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రధాన మంత్రి మోడీ జగన్ తో ఈ సమస్యపై ఫోన్ లో మాట్లాడటమే కాకుండా, జాతీయ విపత్తు నిర్వహణ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు.
https://twitter.com/b0kkaard/status/1258239255698042880