కొద్దిరోజులుగా మీడియా ముందు వారిని వీరిని వాయించి వదిలిన రైటర్ కం ప్రొడ్యూసర్ కోనా వెంకట్ కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నాడు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన శంకరాభరణం ఫ్లాప్ అయ్యే సరికి డీలా పడ్డ కోనా వెంకట్.. ఆ తర్వాత రచనా సహకారం అందించిన సౌఖ్యం, డిక్టేటర్ సినిమాలు కూడా పెద్దగా పేరు తీసుకు రాలేకపోయాయి. అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కోనా మళ్లీ ఓ తీపి కబురు పట్టుకొచ్చాడు.
సౌత్ డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవా చాలా కాలం తర్వాత లీడ్ రోల్ చేస్తున్న సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించబడుతుంది. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ కు కోనా సహకారం తీసుకోనున్నారట దర్శక నిర్మాతలు. ప్రభుదేవా, తమన్న జంటగా నటిస్తున్న ఈ సినిమా అమలా పాల్ భర్త ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు వర్షన్ కు మాటలు, స్క్రీన్ ప్లే రాస్తున్న కోనా హిట్ కొడతాడనే అనుకుంటున్నారు అభిమానులు.
తన పెన్ పవర్ తో కొంతకాలం తెలుగు సినిమాలను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన కోనా మూగాబోవడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సినిమా ఎలా ఉన్నా కోనా నుండి కబురు వచ్చినందుకే సంతోషంలో మునిగి తేలుతున్నారు కొందరు.