విమర్శకుడు మహేష్ కత్తి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రచయిత, నిర్మాత , పవన్ కు సన్నిహితుడు కోన వెంకట్ స్పందించిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరిన కోన‘ జనవరి 15వ తేదీ వరకు అంతా మౌనంగా ఉండండి. కత్తి మహేష్‌కి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీడియా ఛానెళ్లకు వెళ్లి చర్చల్లో పాల్గొనటం.. పవన్‌కు, ఆయన అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడటం లాంటివి చేయొద్దని కోరుతున్నా. అలా చేస్తే శాంతి చేకూర్చాలన్న ప్రయత్నం విఫలమవుతుంది’’ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసిపోయింది. దీంతో కత్తి మహేష్ కోన వెంకట్ కు మరో ట్వీట్ చేశాడు. ”ఎక్కడున్నారు సర్? నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి. మీరేం చేయగలరు” అని ట్వీట్ చేశాడు.
దీనికి షాకింగ్ రిప్లయ్ వచ్చింది కోన నుండి. ” నేను జనవరి 7న ట్వీట్ పెట్టిన తరువాత కూడా నువ్వు ఇదే ఇష్యూపై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు. పవన్ కల్యాణ్, అతని అభిమానులను ఎటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు. నీ డిక్షనరీలో సైలన్స్ కి మరో అర్థం ఏదన్నా ఉందా?’ కౌంటర్ ట్వీట్ చేశాడు కోన.
దీంతో వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించిన కోన కూడా ఇప్పుడు చేతులేట్టేశాడని అనుకోవాలి. మొన్న కత్తి మహేష్ ఉస్మానియాలో కొంతమంది విద్యార్ధులతో కలసి పవన్ కళ్యాణ్ కు హితవుపలికినట్లు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఆక్కడ వున్న విద్యార్ధులు కొందరు కత్తి మహేష్ కు మద్దత్తు తెలుపుతూ పరిస్థితి ఇంకొంచెం వేడెక్కించే వాతావరణం కనిపించింది. ఇది పవన్ అండ్ కో దృష్టికి వచ్చినట్లువుంది. దీంతో ఇంక రాజీలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు కోన.