హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్లతో వివాదానికి స్వస్తి చెబుతున్నట్లు రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు. బ్రూస్లీ చిత్రం స్క్రిప్ట్ గురించి శ్రీను వైట్లతో తన వివాదం గురించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారని, చివరకు ఇదేదో డైలీ సీరియల్ లాగా మారిందని అన్నారు. ఈ వివాదాన్ని పెద్దది చేయటం ఇక వేస్ట్ అని చెప్పారు. ఈ వివాదానికి ఇంతటితో తెర దించుతున్నానని, తమ ఇద్దరి మధ్య ఇప్పుడేమీ లేవని అన్నారు. రేపు పొద్దున శ్రీను వైట్ల, తాను కలిసి మరో మంచి సినిమా అందించి, ఇద్దరమూ కలిసి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పారు.
మరోవైపు శంకరాభరణం చిత్రం టాక్ తేడాగా వినిపించటంపై స్పందిస్తూ, కలెక్షన్స్, జనం స్పందన బాగున్నాయంటూ కోన ఆనందం వెలిబుచ్చారు. తన మాటలకు ఆధారంగా నాలుగు రోజుల కలెక్షన్స్నూ టక టకా చెబుతున్నారు. మొత్తంమీద ఒకటి మాత్రం నిజం చెప్పారు కోన… ఈ వివాదం డైలీ సీరియల్ లాగా సాగుతుందని. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో వేచి చూడాలి.