ఫక్తు కమర్షియల్ సినిమాలకు కథ అందించడంలో దిట్ట కోన వెంకట్. ఆయన హవా చాలా కాలం పాటు సాగింది. అత్యంత ఖరీదైన కథకుడిగా కోన పేరు తెచ్చుకున్నాడు. శ్రీనువైట్లతో కలిసి ఇచ్చిన బ్లాక్ బ్లస్టర్లకు చిత్రసీమ ఊగిపోయింది. ఆ తరవాత.. ఆయనతో విడిపోయారు. నిర్మాతగా మారారు. గీతాంజలి మంచి ప్రాఫిట్స్ని తీసుకొచ్చింది. ఆ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ కోనదే. ఈ సినిమా విడుదలయ్యాక.. అసలు దర్శకుడ్ని సైతం పక్కన పెట్టేశారు. శంకరాభరణం చిత్రానికీ అదే ఫార్ములా. కాకపోతే ఈసారి ఫ్లాప్ వచ్చింది. నిర్మాతగా తాను తీసే సినిమాలపై కోన ప్రభావం పుష్కలంగా ఉంటుంది. అటు కథకుడిగా, ఇటు నిర్మాతగా. దర్శకత్వంలోనూ కోన విపరీతమైన జోక్యం చేసుకుంటాడని టాక్. ఇప్పుడు `నిశ్శబ్దం` విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యిందని టాక్.
హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడైనా – ఆ బాధ్యతల్నీ కోన నెత్తిమీద వేసుకున్నాడని తెలుస్తోంది. హేమంత్ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. తన సినిమాలన్నీ ఫ్లాపే. అయినా సరే, ఏరి కోరి హేమంత్ ని ఎంచుకున్నాడు కోన. పేరుకి మాత్రమే హేమంత్ దర్శకుడని, నిజానికి సెట్లో ఆహోదా కోనకే దక్కిందని తెలుస్తోంది. ఓ దశలో దర్శకుడు ఎవరన్న విషయంలో అనుష్క సైతం కన్ఫ్యూజ్ అయ్యిందని టాక్. కోనలో మాస్ పల్స్ తెలిసిన ప్రేక్షకుడు ఉన్నాడు. తన జడ్జిమెంట్ బాగానే ఉంటంది. అందుకే.. చిత్రబృందం కూడా కోన వెనుకే నిలిచిందట. డైరక్షన్ చేయాలనుకుంటే.. చేసేయాలి గానీ, ఎవరినీ తీసుకుని, వాళ్ల పనిలో జోక్యం చేసుకోవడం ఏమిటో మరి.