ఎన్టీఆర్ లోని కామెడీ టైమింగ్ ని మరోస్థాయిలో చూపించిన సినిమా ‘అదుర్స్’. కోన వెంకట్ కథ అందించగా వి.వి.వినాయక్ తెరకెక్కించారు. అందులో ఎన్టీఆర్ చారి పాత్ర హిలేరియస్ గా పండింది. ఆయన కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే ప్రయత్నాలు గతంలో జరిగాయి కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే తారక్‌తో తప్పకుండా ‘అదుర్స్ 2’ చేస్తానని చెబుతున్నారు కోన వెంకట్. ‘తారక్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఆయనతో ఈ సినిమా చేయిస్తా. ఆయన కెరీర్లోనే ది బెస్ట్ మూవీల్లో ఇదీ ఒకటి. చారి పాత్రకు ఆయన తప్ప వేరొకరు న్యాయం చేయలేరు. వినాయక్‌తోనే సీక్వెల్ కూడా చేస్తా’’అంటున్నారు కోన.
కోన మాటలు నిజమే. నిజంగా చారి పాత్రలో ఎన్టీఆర్ తప్పితే మరో నటుడిని వూహించలేం. ఆయన కెరీర్ లో అదొక మ్యజికల్ పాత్ర. అయితే ఈ సినిమాకి సీక్వెల్ అనే ఆలోచన కుదరేలా లేదు. గతంలోనే ఇది జరగాల్సింది. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎన్టీఆర్ లైనప్ పూర్తిగా మారింది. ఆయన దగ్గరకి వచ్చే కథలన్నీ పాన్ గ్లోబల్ ని ద్రుష్టిలో పెట్టుకునే తయారౌతున్నాయి. పైగా వినాయక్ ఫామ్ లో లేరు. అదుర్స్ రైటింగ్ టీంలో హరీష్ శంకర్ కూడా పని చేశారు. గతంలో ఆ కాంబినేషన్ మళ్ళీ సెట్ చేయాలని చూశారు కానీ కథ ఓకే అవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో అదుర్స్ 2 అంత సులువుగా అయ్యేపనిలా కనిపించడం లేదు.