రైటర్‌గా స్టార్ డమ్ అనుభవించాడు కోన వెంకట్. త్రివిక్రమ్ తరవాత అంత వెలుగు వెలిగిన రైటర్ ఆయనే. అయితే.. ఆ తరవాత ఆ జోరు తగ్గింది. కోన స్క్రిప్టుల్లో మెల్లమెల్లగా పస తగ్గుతోంది. ఒకే లైన్ పట్టుకొని సీన్లు అటు మార్చి, ఇటు మార్చి కథలు అల్లేస్తాడన్న విమర్శలు కొని తెచ్చుకొన్నాడు. అయితే రైటర్ గా ఫామ్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకొన్నాడు. శ్రీనువైట్లతో వార్ జరుగుతున్నప్పుడే దర్శకుడిగా అవకాశాల కోసం అన్వేషించాడు. పైగా రైటర్‌గా మారిన ప్రతీ రచయితా సక్సెస్ అయిపోవడంతో… తనకు మెగా ఫోన్ పట్టాలని బలంగానే అనిపించింది. చిన్నా చితకా హీరోలెందుకు అనుకొన్నాడేమో, ఏకంగాపవన్ కల్యాణ్ లాంటివాడికే స్కెచ్ వేశాడు. అయితే ఇందంతా రెండేళ్ల క్రితమే. ఇప్పుడు ఆ ఊసే లేదు.
దాదాపుగా కోన దర్శకుడవ్వాలన్న ఆలోచన పక్కన పెట్టేసినట్టే. ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తితే జోకుల మీద జోకులు పేలుస్తున్నాడు. డైరెక్టర్ అవ్వాలని ఇప్పటికీ బలంగా ఉందని, అయితే తనతో పనిచేసిన దర్శకులు మాత్రం నువ్వు దర్శకుడైపోతే, మాకు కథలెలా దొరుకుతాయ్? అని అడ్డు చెబుతున్నార్ట. వాళ్ల కోసమే… దర్శకత్వాన్ని పక్కన పెట్టాడట. అంతేకాదు. తానుకూడా దర్శకుడైపోతే నిజాయతీ ఉన్న కథలు రావడం పూర్తిగా మానేస్తాయని, అందుకే మంచి కథల కోసమే దర్శకత్వం ఆలోచనని తాత్కాలికంగా పక్కన పెట్టానని అంటున్నాడు కోన. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందా?
కోన కళాఖండాలకు పని చేయలేదు. జస్ట్ కమర్షియల్ ఫార్మెట్లో వెళ్లిపోయే సినిమాలకు మాత్రమే పనిచేశాడు. పైగా కేవలం కథాబలంతో ఆయా సినిమాలు ఆడలేదు.. హీరోయిజం, స్టార్ డమ్, దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ కలిసొచ్చాయి.
ఆ సంగతి మర్చిపోయి… కోన ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. నిజం చెప్పాలంటే శంకరాభరణం సినిమాని వెనుక ఉండి నడిపించింది కోననే. ఆ సినిమాకి తనే అసలు సిసలు ఘోస్ట్ డైరెక్టర్. ఆ సినిమా హిట్టయితే.. తప్పకుండా మరో సినిమా మొదలెట్టేద్దుడు. కానీ ట్రైల్ ఫ్లాప్ అవ్వడంతో రియల్స్ బంతి వేయడానికి భయపడిపోతున్నాడు. పైగా రచయితగా కోనకు హిట్స్ లేవిప్పుడు. విజయాలతో జోరుమీదున్నప్పుడే ఎవరూ పట్టించుకోలేదు. దర్శకుడిగా అవకాశాలివ్వలేదు. ఇప్పుడు కోనని పట్టించుకొంటారా? అందుకే హాయిగా ఏసీ రూముల్లో, బ్యాంకాక్ బీచుల్లో కూర్చుని కథలు రాసుకోవడమో, రాయించుకోవడమో బెటర్ అని డిసైడ్ అయ్యాడు. ఆ నిజం చెప్పుకోలేక ఇలా జోకులు పేలుస్తున్నాడంతే!