ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా మొదలవక మునుపే అధికార తెరాస బోణీ కొట్టింది. వరంగల్ నుండి తెరాస అభ్యర్ధిగా బరిలోకి దిగిన కొండా మురళితో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో బాటు నామినేషన్ వేసిన ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్ధి తన నామినేషన్ ఉపసహంరించుకోవడంతో కొండా మురళి పోటీ లేకుండా గెలిచారు. మొత్తం 12 స్థానాలకు పోటీ చేస్తున్న తెరాసకు ఇది మంచి శుభసూచకంగా పరిగణిస్తోంది. కొండా సురేఖ వరంగల్ పట్టణం తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె భర్త మురళి కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కొండా దంపతులిద్దరూ శాసనసభ, శాసనమండలిలో సభ్యులయ్యారు. అందుకు వారు ఛాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.