కొండా సురేఖ రాజీనామాకు హైకమాండ్ ఆదేశించిందని ఓ ప్రచారాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉద్ధృతంగా చేసింది. నిజానికి ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రియాంకా గాంధీ.. నాగర్జున వైఫ్ అమలకు ఫోన్ చేశారని కూడా పుకార్లు పుట్టించుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. అసలు ఈ వివాదాన్ని అసలు హైకమాండ్ ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదని చెబుతున్నారు.
రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కుట్రలు జరుగుతాయో తెలుసుకోలేనంత అమాయకంగా హైకమాండ్ ఉండదని అండదని.. పార్టీ నేతలకు కాకుండా ఇతరులకు మద్దతుగా ఎలా నిలుస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఏదైనా స్పందించాలనుకుంటే ముందుగా పార్టీ నాయకత్వం నుంచి సమాచారం తెప్పించుకుంటుంది . అయినా సొంత మంత్రితో రాజీనామా చేయిస్తే ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ ఎంతో తెలుసు కాబట్టి హైకమాండ్ అలాంటి ప్రయత్నం చేయదని అంటున్నారు.
బీఆర్ఎస్ తో కలిసి సినీతారలు రాజకీయం చేస్తున్నారని అంతా ఒకరి తర్వాత ఒకరు స్పందించడం వెనుక వ్యూహం ఉందని కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలుసని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచేందుకు కొంత మంది మైండ్ గేమ్ ఆడుతున్నారని..రాజీనామా ప్రచారాలు తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కొండా సురేఖతో రాజీనామా చేయించేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.