బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య – సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆరేనని ఆరోపించారు.
అంతేకాదు.. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు త్వరగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొని, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కేటీఆర్ కారణం అని షాకింగ్ కామెంట్స్ చేశారు కొండా సురేఖ.
బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేటీఆర్ డ్రగ్స్ మాయలో పడి, వాళ్లకు అలవాటు చేశారని ఆరోపించారు.
రేవ్ పార్టీలు చేసుకొని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసేవాడని కొండా సురేఖ ఆరోపించారు. ఈ విషయం సినీ ఇండస్ట్రీకి చెందిన అందరికీ తెలుసునని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేటీఆర్ డైరక్షన్ లో సాగిందని ఆరోపించిన ఆమె..తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.