తెలంగాణ రాష్ట్ర సమితికి నిన్న రాజీనామా చేసిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇరవై మూడో తేదీన.. మేడ్చల్‌లో జరగనున్న కాంగ్రెస్ బహిరంగసభలో.. సోనియా, రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాతో పాటు… రాహుల్ నివాసానికి వెళ్లిన… కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రాహుల్‌తో అరగంట పాటు చర్చలు జరిపారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్కు రాజీనామా చేయాల్సిన పరిస్థితులను… రాహుల్‌తో భేటీ తర్వాత.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పూర్తిగా వెల్లడించలేదు. వ్యక్తిగత కారణాలతో మాత్రం రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అని వార్య పరిస్థితుల్లోనే…టీఆర్ఎస్కు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. నిన్న పార్టీకి రాజీనామా చేసినప్పుడు.మూడు పేజీల లేఖతో పాటు… ఓ వీడియో విడుదల చేశారు. రాహుల్‌తో భేటీలో పాల్గొన్న… కుంతియా.. ఇక ముందు కూడా.. వలసలు ఉంటాయని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనంటున్నారు. పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో సహజంగానే ఎవరికీ నోరు మెదిపే అధికారం కూడా ఉండదు. తొలిసారి.. అలాంటి పరిస్థితిని ధిక్కరించి.. ఓ ఎంపీ బయటకు వెళ్లారు. ఇదే.. అందర్నీ… ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికార కేంద్రం బలంగా ఉన్నంత కాలం… నేతలు .. నోరు తెరవకుడా ఉంటారేమో కానీ.. బలహీన పడుతున్నారని తెలిసిన తర్వాత.. ఎవరూ .. అణగిమణిగి ఉండరని విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికలకు ముందు భారీగా వలసల ప్రచారం ఈ కోవలోకే వస్తుందంటున్నారు.